టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఒక దర్శకుడికి కూడా అభిమానులు ఉంటారని పూరి జగన్నాథ్ విషయంలో రుజువయింది. మొదటి సినిమా నుంచి తనకు మాత్రమే సాధ్యం అయ్యే చిత్రాలు చేస్తూ హీరోల కంటే ఎక్కువగా మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఏ హీరోతో సినిమా చేసినా కూడా పూరీ జగన్నాథ్ అభిమానులు సినిమా నీ వేరే లెవెల్ హిట్ చేసేవారు.
సాధారణ ప్రేక్షకులు సైతం డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి అభిమానులుగా మారిపోయారు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా పరిశ్రమలో కొందరిని నమ్మడం వారి వల్ల మోసపోవడం వంటివి ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తున్నాయి. అలాగే పూరి జగన్నాథ్ కూడా సొంత వాళ్లని నమ్మి కొందరికి డబ్బు ఇచ్చి వారి వల్ల నష్టపోయి దాదాపు పాతాళం లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్లీ కోలుకొని సినిమాలు చేసి మళ్లీ ట్రాక్లోకి వచ్చారు.
ఇక తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఈయన పై ఓ వార్త ప్రచారం అవుతుంది. అదేమిటంటే దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి తో క్లోజ్ గా ఉండడం. ఇది పూరి జగన్నాథ్ భార్య కు నచ్చడం లేదని దాంతో వారిద్దరి మధ్య కలహాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు కానీ ఇదే నిజమైతే ఉంటుందని దాదాపు అధికభాగం ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఇటీవల నాలుగు కోట్ల విలువచేసే ఇల్లు కూడా ఛార్మి కి ఇచ్చారని వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే వీరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరీ. అంతకుముందు ఈ దర్శకుడికి కెరీర్ అంత బాగోలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.