సినిమా చూపిస్త మామా : కుర్ర హీరోల కొత్త కబుర్లు
కొన్ని ఓటీటీలకు చిన్న హీరోలే పెద్ద దిక్కుగా మారిపోయి, తమ అదృష్ట్యాన్ని పరీక్షించు కుంటున్నారు. మరోవైపు పెద్ద సినిమాల నిర్మాణం పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తో సహా ఆచార్య కూడా థియేటర్ ను పలకరించేం దుకే సన్నాహం సిద్ధం అవుతోంది. పెద్ద సినిమాలు వస్తే థియేటర్ల బతుకు బాగుంటుంది అని సినిమా వర్గాలు ఆశపడుతున్నా యి. కరోనా కాస్త తగ్గితే సినిమాల నిర్మాణం ఇంకొంత పుంజుకుంటే పెద్ద హీరోల స్థాయికి అనుగుణంగా జరిగే మార్కెట్ అన్నది మ రో నాలుగు కొత్త సినిమాలకు ఊపిరి అందిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తూ, రాను న్న కాలంపై సానుకూల దృక్పథం పెంచు కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెట్స్ పై ఉన్న కొన్ని సినిమా ఊసులు ఇవి.
ఆచార్య తరువాత వరుస రెండు సినిమాలు ఓకే చేశారు చిరు. కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయాయి అనుకున్న సినిమాలకు ప్రాణం వచ్చి, పూర్వ ఉత్సాహం తెచ్చుకుని అవి తమ ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ కోవలో బాలయ్య అఖండ, వెంకీ దృశ్యం2, నాగార్జు న బంగార్రాజు ఇలా కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రక్రియను షురూ చేశాయి. కొన్ని ఓటీటీకి వెళ్లినా ఆశ్చర్య పోన వసరం లేదు. పూర్తిగా థియేటర్ల హవా నడుస్తుండడం లేదు కనుక పెద్ద హీరోల రాక అన్నది స్పష్టంగా తెలియరావడం లే దు. అయినా కష్ట కాలంలో సినిమాలు రూపుదిద్దుకోవడం అన్నది కత్తిమీద సాములా ఉంది. కొత్త హీరోలు లేదా కుర్ర హీరోలు తమ భవి ష్యత్ పై ఆశలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఆత్మ విశ్వాసం నిలుపుకునేందుకు ఒక దారి వెతుకుతున్నారు.
నాని టక్ జగదీశ్ పై వివాదం రేగుతున్నప్పటికీ మరో రెండు సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇవే కాకుండా తనకు కలిసి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ తో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాడు నానీ. ఇక అల్లూ అర్జున్, ప్రభాస్, రవితేజ, వైభవ్ తేజ్, సాయి తేజ్ ఇలా వీరంతా కూడా వరుస సినిమాల హడావుడిలో ఉన్నారు. పాన్ ఇండియాపై ప్రేమ పెంచుకునే దిశగా అటు తారక్ ఇటు చరణ్ కూడా ఉన్నారు. చరణ్ ఆచార్య తరువాత చేసే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు.
బన్నీ - కొరటాల, బన్నీ - పరశురాం కాం బోలు మాత్రం మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీరితో పాటు ప్రశాంత్ నీల్ తారక్ , ప్రభాస్, బన్నీలతో వరుస సినిమాలు చేయ నున్నారు. కేజీఎఫ్ సీక్వెల్ ను పూర్తి చేశాక ఇక ప్రభాస్ సినిమా పై పూర్తి ఫోకస్ ఉంచనున్నా రు. ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న దృష్ట్యా ఆయన స్క్రిప్ట్ పనులపై మరింత శ్రద్ధవహించారని తెలుస్తోంది. నాగ చైతన్య తో సినిమా పూర్తి చేసిన శేఖర్ కమ్ముల తరువాత చిత్రం ధనుష్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నారు.