ఆమె వల్లే రూమర్స్ కి గురయ్యానంటున్న.సునీత..

Divya
టాలీవుడ్ లో సింగర్ సునీత.. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కొంత మంది హీరోయిన్లకు వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేయడం తనకే సాధ్యం అన్నట్లుగా నిరూపించుకుంది. ఈ మధ్య కాలంలోనే కొన్ని ప్రోగ్రాం లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న"డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం"కు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


డ్రామా జూనియర్స్ ప్రోమోలో  ఈ స్క్రిప్టు లో భాగంగా సమాజంలోని ఉన్న ఆడవాళ్లను మగవాళ్ళు, స్నేహంగా ఉంటే ఎలా ఉంటుంది. దానిపై నలుగురు అమ్మాయిలు స్కిట్ వేశారు. ఇక స్క్రిప్టులో భాగంగానే సమాజం వారి పై ఎలాంటి నిందలు వేస్తుంది. వారి పట్ల సమాజం ఎలా చూస్తుంది. అనే విషయంపై ఈ స్కిట్ జరిగింది. కానీ సమాజంలో ఇలా అనుకోవడం చాలా తప్పు, ఒక అబ్బాయి,ఒక అమ్మాయి స్నేహపూర్వకంగా  ఉంటే సమాజం వారి మధ్య ఏదో ఉన్నట్లు తప్పు చూపిస్తుంది.


దీనిపై స్పందిస్తూ.. సింగర్ సునీత స్కిట్ పూర్తయిన వెంటనే.. ఆ పిల్లలను చూస్తూ సూపర్ గా చేశారు స్కిట్. ఇలాంటివి నేను ఎన్నో ఎదుర్కొన్నాను
. కానీ ఇలాంటివి ఇంక ఎవరూ బాధపడకుండా సమాజంలో తన తల్లిదండ్రులు, తమ పిల్లలను అపార్థాలు చేసుకోకుండా ఉండాలి అని చెప్పుకొచ్చింది. కేవలం వారి వల్లే సింగర్ సునీత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలుపుకు వచ్చింది.


ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత తన మీద వచ్చిన పుకార్లన్నీ, ఆ మహిళ వల్లే వచ్చాయని తెలుపుకు వచ్చినది. తను డైరెక్టరతో,అబ్బాయి తో మాట్లాడినా.. సునిత మీద ఏవో ఒక వార్తలు రాస్తూ ఉండేదట. తన డబ్బులతో ఇల్లు కొనలేదు, తన డబ్బులు కష్టపడి సంపాదించలేదు.. ఇలా తన పక్కనే ఉంటున్న ఒక మహిళ చెబుతూ ఉండేదట. వాటన్నిటిని తన చుట్టూ ఉండే వాళ్ళు నమ్మేవారట. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నట్లు తెలుపుకు వచ్చినది సింగర్ సునీత. కానీ మన స్నేహితులు మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: