ఆ రూమర్స్ కి చిరు చెక్ పెట్టేనా..?
ఈ సినిమాలో మోహన్ లాల్ పోషించిన పొలిటీషియన్ పాత్రలో మెగాస్టార్ మెరవనున్నారు. అలాగే విలన్ గా సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఎవరు నటించనున్నారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులను పరిశీలించినప్పటికీ, ఎవరైనా యూనివర్శల్ స్టార్ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన బాలీవుడ్ స్నేహితుడు సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని సూచించారట. ఆలస్యం అమృతం విషం చందంగా సల్మాన్ కు మెగాస్టార్ ఫోన్ చేసి విషయం చెప్పారని సమాచారం.
పృథ్వీరాజ్ పాత్ర కొన్ని సన్నివేశాల్లో కనిపించినా ఫైటింగ్ సీన్‌లలో రోమాలు నిక్కబొడుస్తాయి. అలాంటి పాత్రలో సల్మాన్ నటిస్తే సినిమా ఓ రేంజ్‌కు వెళుతుంది. తన స్నేహితుడు చిరు పిలుపు మేరకు సల్మాన్ ఈ పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతాడా లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 15 నాటికి సల్మాన్ నటిస్తారా లేదా? అన్నదానిపైనా క్లారిటీ వస్తుందని చిత్ర బృందం టాక్. ఇక ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారని మనందరికి తెలిసిన విషయమే. ఇందులో చిరంజీవి సరసన కథానాయిక ఎవరు? అంటే ఎవరూ లేరనే చెప్పాలి. నిజానికి మాతృకలో మోహన్ లాల్ కి కథానాయిక ఉండరు. దాంతో ఈ సినిమాలో హీరోయిన్‌ను పెట్టాల వద్దా అనే ఆలోచనలో ఉన్నారు.