చరణ్ జూనియర్ ల మధ్య చిచ్చుపెడుతున్న బాలీవుడ్ మీడియా !
ఈమధ్యనే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేయడంతో ఆ సాంగ్ వైరల్ గా మారడమే కాకుండా ఆ పాటకు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈపాటలో చరణ్ జూనియర్ లు చేయిచేయి కలుపుతూ కనిపించిన ఒక సీన్ మెగా నందమూరి అభిమానులకు జోష్ ను ఇచ్చింది.
ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై బాలీవుడ్ కు సంబంధించిన ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్ నందమూరి మెగా అభిమానుల మధ్య అనవసరపు చిచ్చు రగిలిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమోషన్ సాంగ్ వీడియోలో చరణ్ లుక్ జూనియర్ లుక్ కన్నా అందంగా ఉంది అంటూ ఆ బాలీవుడ్ క్రిటిక్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ కామెంట్స్ రాజమౌళి దృష్టి వరకు వచ్చినట్లు టాక్. ఈమూవీలో చరణ్ జూనియర్ లు కనిపించారని కేవలం వారు నటించే అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అంటూ గతంలో అనేకసార్లు రాజమౌళి మీడియాతో చెపుతూ వచ్చాడు. అయితే మెగా నందమూరి అభిమానులు మాత్రం తమ హీరోలలో ఏ హీరోకి ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తుంది అన్న విషయం చాల నిశితంగా చూడాలని ఉబలాట పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో మల్టీ స్టారర్ లు తీయడం అంత సులువైన పనికాదు. ముఖ్యంగా చరణ్ జూనియర్ లను కలిపి సినిమా తీయగల సత్తా ఒక్క రాజమౌళికి తప్ప మరెవ్వరికి లేదు. అయితే బాలీవుడ్ మీడియా ఎదో ఒక విషయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ పై విమర్శలు చేసి తన ఆదిపత్యాన్ని చూపెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగమే ఇలా చరణ్ జూనియర్ ల లుక్ ల మధ్య బాలీవుడ్ విశ్లేషణ అనుకోవాలి. ఇలాంటి టి కప్పులో తుఫానులు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యాక ఇంకా చాల ఉంటాయి. వీటన్నింటిని తట్టుకునే మాష్టర్ ప్లాన్ రాజమౌళి మనసులో ఇప్పటికే ఉండి ఉంటుంది..