రాకరాక రోల్ వేస్తే రాజశేఖర్ ఇలా చేస్తున్నాడంటే!!

P.Nishanth Kumar
గరుడ వేగ సినిమా తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ ఆ సినిమా హిట్ ఆయనలో ఎంతో జోష్ ను తీసుకువచ్చింది. ఇక ఆయన ఫామ్ లోకి వచ్చేసాడు అనుకుంటున్న తరుణంలో రాజశేఖర్ అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ వెంటనే రాజశేఖర్ చేసిన కల్కి అనే సినిమా రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో తో ఆయన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

ఇప్పుడు మళ్ళీ ఓ హిట్టు కొట్టి నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజశేఖర్ కి. గతంలో కూడా ఇదే విధంగా తన కెరియర్ ను అస్తవ్యస్తంగా ఏర్పరుచుకున్నాడు. ఒక సినిమా హిట్ కొడితే నాలుగైదు సినిమాలు ఫ్లాప్ కొట్టడంతో రాజశేఖర్ ఇతర హీరోల కంటే వెనుకబడి పోయాడు. ఇప్పుడు గరుడ వేగా సినిమా తో మారాడు అనుకుంటే ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ మళ్ళీ సినిమా పరిశ్రమకు దూరం అయ్యే విధంగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఓ మలయాళ సినిమా రీమేక్ లో రాజశేఖర్ నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తో  రాజశేఖర్ మళ్లీ హిట్ కొడతాను అని గట్టిగా నమ్ముతున్నాడు.

ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ కి గోపీచంద్ సినిమా లో విలన్ గా నటించే అవకాశం వచ్చినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు రాగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జగపతిబాబు లాగే రాజశేఖర్ కూడా దూసుకుపోవాలని ఆయన అభిమానులు ఆశించారు. కానీ రాజశేఖర్ రెమ్యునరేషన్ విషయంలో ఈ సినిమా పట్ల కొంత అ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నాడట. దాంతో రాజశేఖర్ ను తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో నిర్మాతలు పడ్డారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికం రాజశేఖర్ డిమాండ్ చేశారు.  రాజశేఖర్ ఇప్పుడున్న పరిస్థితి లో ఒక కోటి రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు. మరి రాజశేఖర్ తగ్గుతారా.. లేదా.. నిర్మాతలు అడిగిన డబ్బు ఇస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: