టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం జానపద గేయాలను ఎక్కువగా వాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఇస్మార్ట్ శంకర్, శ్రీదేవి సోడా సెంటర్ అలాగే ఇటీవలే వచ్చిన వరుడు కావలెను అనే సినిమాలో జానపద గేయాలను విడుదలచేసి ఆ పాట యొక్క ప్రత్యేకతను చాటుతున్నారు. గతంలో జానపద గేయాలు అంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ పెరిగిపోతుండడంతో కొన్ని క్రేజీ సినిమాల్లో జానపద గేయాలను వాడుతూ ఆ పాట యొక్క విశిష్టతను అందరికి తెలియజేస్తున్నారు.
జానపద గేయాలు అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఎంతో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని గమనించిన మన నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్లతో ఈ తరహా పాటలు చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రైవేటు షోలలో మాత్రమే జానపద గేయాలు ఎక్కువగా పాడేవారు. దీనికి సపరేటు సింగర కూడా ఉండేవారు. వారు తమ గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే వారు కానీ ఇప్పుడు సినిమాలలోకి ఈ పాటలు రావడంతో వారికి ఒక్కసారిగా లైఫ్ వచ్చినట్లు అయింది. రోజురోజుకు ఈ పాటల ఆదరణ పెరుగుతున్న నేపథ్యం లో ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా నాగశౌర్య హీరోగా నటించిన వరుడు కావాలి అనే సినిమా లో దిగు దిగు దిగు నాగ అనే పాటను విడుదల చేశారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఇప్పుడు విడుదలైన ఈ జానపద గేయం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అనంతశ్రీరామ్ రాశారు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పాట ఇది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టొరీ సినిమాలో కూడా సారంగదరియా అనే జానపద గేయం ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరి భవిష్యత్తులో ఇంకెన్ని జానపద గేయాలు సినిమా లలో వస్తాయో చూడాలి.