ఎవరు మీలో కోటీశ్వరుడు బిగ్ బాస్ ను బీట్ చేస్తుందా?

murali krishna
బుల్లితెరలో కూడా టాలీవుడ్ హీరోల ప్రాతినిధ్యం బాగా పెరుగుతోంది. గతంలో నాగార్జున, చిరంజీవి వంటి స్టార్ హీరోలే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరించగ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరో తన గొంతును వినిపించబోతున్నారు. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు తాజాగా ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది.బుల్లితెర రేటింగ్ పెంచుకోవడంలో ఆయా చానళ్లు పోటీ పడడం వంటి విషయం తెలిసిందే. అందుకే ఈ కార్యక్రమం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Who wants become a millinior కార్యక్రమం ఆధారంగా భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ప్రారంభమైంది. బిగ్ బి అమితాబచ్చన్ యాంకర్ గా ఈ ప్రోగ్రాం మంచి హిట్ కావడంతో దీన్ని అన్ని భారతీయ అన్ని భాషల్లో విడుదల చేశారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదటగా నాగార్జున హోస్ట్ గా మూడు సీజన్లు చేశారు. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ కార్యక్రమం కొన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం మళ్లీ బుల్లితెరా తెరమీదకు రాబోతుంది.దీంతో ఈ షో పై యాజమాన్యం భారీ ఆశలే పెట్టుకుంది.
నాలుగో సీజన్ కు హోస్ట్ గా చిరంజీవి వ్యవహరించినా అప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన అమ్మ జయలలిత వ్యవహారంతో ఈ  షో అంతగా పాపులర్ కాలేదు. ఈ నేపథ్యంలో జనానికి విసుగు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు కొత్తగా మంచి ఆకర్షణగా నిలిచే  అవకాశాలు  కనిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్  భారీగా పెంచుకునే క్రమంలో జెమినీ టీవీ ఏ విధమైన ఫలితం సాధిస్తుందో ఎదురు చూడాల్సిందే.ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం.. దీనికి ఆయన ప్రోమోలు డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి త్రివిక్రమ్ ఈ షో ప్రోమోస్ డైరెక్ట్ చేయాలనుకున్నా కూడా అనుకోని కారణాలతో ఒక ప్రోమో మాత్రమే ఆయన తెరకెక్కించాడు. అయితే ఈ షో కోసం కొన్ని ప్రోమోలు కూడా డిజైన్ చేసారట.ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో కు పోటీగా స్టార్ మా వారు బిగ్ బాస్ సీజన్ 5 షో స్టార్ట్ చేస్తున్నారు.ఈ  షో ఎప్పుడో మొదలువ్వాల్సింది కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ షో మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకు తన వాక్చతుర్యంతో బిగ్ బాస్ ను పరిచయం చేసాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడుతో మళ్ళీ బెస్ట్ హోస్ట్ అనిపించుకుంటాడో లేదో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 5 ఈ సారి చాలా కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఎన్టీఆర్ షో ని తట్టుకొని బిగ్ బాస్ షో ఏమాత్రం రేటింగ్స్ సంపాదిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: