మహేష్ కూతురు 'సితార' పెయింటింగ్ వైరల్...

VAMSI
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ మహేష్ సరసన మొదటి సారిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాపై చిత్ర బృందం అంతా ఎంతో నమ్మకంతో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈమెకు మహేష్ అంటే పంచ ప్రాణాలు అని చెప్పాలి. అంతా కేర్ గా చూసుకుంటాడు మహేష్. సితార కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే తాను ఇంస్టా గ్రామ్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇందులో తన అభిరుచులను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదు అప్పుడప్పుడూ తన తల్లి నమ్రతా శిరోద్కర్ ఇంస్టా గ్రామ్ ఖాతా నుండి కూడా మహేష్ యొక్క సినిమా విశేషాలను పంచుకుంటూ ఉంటుంది.
సితారకు అందరి పిల్లలలాగే పెయింటింగ్ అంటే చెప్పలేనంత ఇస్తామని తెలిసిన విషయమే. అప్పుడప్పుడూ తాను స్నేహితులతో కలిసి వేసిన పెయింటింగులను ఇంస్టా గ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉండేది. తన అభిరుచిని తల్లితండ్రులు ఎప్పుడూ అభినందిస్తుంటారు. ఈమెకు పెయింటింగ్ కు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 'ఆధ్య అండ్ సితార' అనే పేరుతో ఇది కొనసాగుతోంది. ఈ ఛానల్ ద్వారా వివిధ రకాల పెయింటింగులు ఏ విధంగా వేయాలో సితార వీక్షకులకు చెబుతూ ఉంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా విడుదల చేసింది.

 
ఈ వీడియోలో సితార అక్రైలిక్ పెయింట్ ను ఉపయోగించి స్కై ను ఎలా పెయింట్ ఎలా వేయాలో చక్కగా స్టెప్ బై స్టెప్ వివరించిన విధానం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఛానల్ ను 247K మెంబెర్స్ సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను చుసిన వారి ఈ పెయింటింగ్ ఎంతగానో నచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను ఒక లుక్కేయండి. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: