మళ్ళి సినిమాలో నటించాడనికి సిద్దమైన చిరంజీవి భార్య..!?
ఇక అతడు తమ్ముడు ధృవ్ సార్జా కూడా తెలుగు ప్రేక్షకులకు ‘పొగరు’ అనే మూవీతో పరిచయమైన సంగతి తెలిసిన విదితమే. అయితే చిరంజీవి భార్య భార్య మేఘన కూడా ఓ హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెల్సిన విషయమే. కాగా.. కన్నడ హీరో చిరంజీవి చనిపోయే టైంకి ఆమె నిండు గర్భిణి. ఆ తరువాత ఆమె ఓ బాబుకు జన్మించిన విషయం తెల్సిందే. ఇక ఆమె తన కొడుకుని జూనియర్ సి అని పిలుస్తుంటుంది మేఘన. దానికి అర్ధం ఏంటంటే.. . అంటే జూనియర్ చిరంజీవి అన్న మాట.
అయితే ‘ఈ రోజు నా కొడుక్కి 9 నెలలు. ఏడాది తర్వాత నేను కెమెరా ముందుకొచ్చాను’ అంటూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. ఇక తన బాధని దిగమింగుకొని తన కొడుకు భవిష్యత్తు కోసం ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యిందని స్పష్టంగా అర్ధం అవుతుంది. కాగా.. ఆమె పూర్తి పేరు మేఘన రాజ్. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘బెండు అప్పారావు’ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత మళ్ళీ ఆమె తెలుగులో సినిమా చేయలేదు. ఇక కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె రెండు, మూడు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.