తమిళ హీరో విజయ్ కు కోర్టులో ఊరట
కొన్ని సార్లు వ్యాఖ్యలు కొన్ని సార్లు మాటలు ఉత్పాతంగా తోచినా సబబే అయి ఉంటాయి..అలా మద్రాసు కోర్టు మాటలు విరమిం చుకోకపోయినా విజయ్ కు మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి పంపింది. పన్ను మినహాయింపు కోరుతూ ఆయన చేసిన అప్పీల్ సబబుగా లేదని తేల్చింది ఇదివరకే. హీరోలు హీరోల్లానే ఉండాలి అనేందుకు న్యాయస్థానం వెనుకంజ వేయలేదు.. ఆ వివరం ఇలా..
తమిళ హీరో విజయ్ కు కోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఇటీవల విధించిన జరీమానా మాద్రాసు కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. ఖరీదయిన కారు కొనుగోలు చేసి ఎంట్రీ టాక్స్ కట్టకపోవడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.. వీటిని న్యాయమూర్తి ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు మాట్లాడబోమని పేర్కొంటూ కేసును వచ్చే నెలాఖరుకు వాయిదావేసింది. విజయ్ దాఖలు చేసిన అపీల్ పిటిషన్ పై ఇవాళ వాదోపవాదాలు నడిచాయి. హీరో గా ఉంటూ పన్ను ఎగవేత దారుగా ఆయన కోర్టుకు వచ్చిన క్రమాన్ని మద్రాసు హై కోర్టు ఇదివరకే ఆక్షేపించింది. కీలక వ్యాఖ్యలు చేసింది..ఇవి పలు చర్చలకు తావిచ్చాయి..ఆయనకు విధించిన లక్షరూపాయల జరిమానా పై మాత్రం మధ్యంతర ఉత్తర్వు ఇచ్చి విజయ్ కు ఊరట ఇచ్చింది. ఆయన చెల్లించాల్సిన పన్ను బకాయిని వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.మొత్తానికి హీరో విజయ్ కథ కాస్త మరో మలుపునకు కారణం అయింది. పన్ను ఎగవేతకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు . అదేవిధంగా కోర్టు దగ్గర తన పరువు పోగొట్టుకున్నారు. సినిమా వరకూ సరే బయట కూడా అదే హుందాతనం ఉంటే మేలు. లేదంటే వివాదాలు ఇంటి పేరు అయి తీరుతాయి.,. కోర్టు తన వ్యాఖ్యలు అయితే ఉపసంహరించుకునేలా లేదు.. చూడాలి.తెరపై హీరోలు తెర వెనుక జీరోలు అనిపించుకోకుండా ఇంకా మేలు ఆ దిశగా ఆలోచించు విజయ్.....