అర్జున్ రెడ్డి సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..!?

N.ANJI
కొందరు హీరో హీరోయిన్లు కొన్ని సినిమాల కథలను డైరెక్టర్లు చెప్పినప్పుడు రిజెక్ట్ చేస్తారు. కథ నచ్చకపోవడమో.. డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఆ సినిమాలను వదులుకుంటారు. అయితే ఆ సినిమా ఊహలకు అందని విధంగా సక్సెస్ అవుతుంది. సినిమా మంచి హిట్ అయిందని.. ఆ ఆఫర్ ఎందుకు మిస్ అయ్యామని బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు చాలా మందికి చోటు చేసుకుంటాయి. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా ఎందుకు మిస్ చేసుకున్న అని బాధ పడుతుంటారు. ఈ వరుసలో మలయాళ నటి పార్వతీ నాయర్ కూడా ఉన్నారు.
అందం, అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం లేకుండా పోయింది. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో తను హీరోయిన్‌గా ఆఫర్‌ను వదులుకున్నారు. మంచి కమర్షియల్ హిట్ నమోదు చేసుకున్న ఈ సినిమాను తను ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో అధికంగా లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సినిమాను వదులుకున్నట్లు నటి పార్వతీ నాయర్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లో ఓ అభిమాని.. అర్జున్ రెడ్డి సినిమా అవకాశాన్ని వదులుకోవడం వల్ల బాధ పడుతున్నారా..? అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు.
ఈ సందర్భంగా పార్వతీ నాయర్ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమాను వదులుకోవడం చాలా బాధగా ఉందన్నారు. ఈ సినిమా మిస్ అయినా.. అలాంటి మరో మంచి సినిమా నటించేందుకు ఆఫర్ మళ్లీ వస్తుందని చెప్పారు. కాగా, ఈ కామెంట్‌పై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. కొందరు పాజిటివ్ వేలో చెబుతుంటే.. మరికొందరు నెగిటివ్ వేలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించిన షాలినీ పాండే స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ సొంతం చేసుకోలేదు. కాగా, పార్వతీ నాయర్ ఉత్తమ విలన్, ఎన్నై అరింధాల్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: