రాజమౌళి.. మెగాస్టార్ చిరంజీవి కాంబో.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్..!

shami
టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి బాహుబలి రెండు పార్ట్ ల వరకు రాజమౌళి సినిమా అంటే హిట్ సినిమాకు ఒక బ్రాండ్ అన్నట్టే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలయికలో క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఈ సినిమా బాహుబలి కాదు అంతకుమించి అనిపించేలా చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.
ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నారు జక్కన్న. ఈ సినిమాకు సంబందించిన అఫీషియన్ల్ న్యూస్ త్వరలో రానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మహేష్ సినిమా మీద కూడా ఇప్పటికే అంచనాలు పెరిగాయి. మహేష్ మూవీ తర్వాత కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాజమౌళి సినిమా ఉంటుందని టాక్. ఈ మెగా మూవీ కోసం చరణ్ ఇప్పటినుండే డిస్కషన్స్ మొదలు పెట్టారని తెలుస్తుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ సినిమా ఆ తర్వాత రాజమౌళి కచ్చితంగా చిరంజీవితో చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి.. మెగాస్టార్ చిరంజీవి.. ఈ కాంబో సినిమా వస్తే మాత్రం మరోసారి తెలుగు సినిమా రికార్డులన్ని తిరగ రాసే సినిమా అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాతో చిరు మరోసారి నేషనల్ స్టార్ గా తన సత్తా చాటే అవకాశం ఉంటుంది. బాహుబలి రికార్డులను ఆర్.ఆర్.ఆర్.. ఈ సినిమా రికార్డులు మహేష్ మూవీ.. మహేష్ రికార్డులను చిరు సినిమాతో కొల్లగొట్టే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. మెగాస్టార్ చిరంజీవితో సినిమా కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తోనే చేయాలని చూస్తున్నాడు. రాజుల కాలం నాటి కథతోనే చిరు సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రాజమౌళి స్కెచ్ వేస్తే ఇక దానికి తిరుగు ఉండదని తెలిసిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: