ఆ లిస్ట్ లో మహేష్ - విజయ్..?

Suma Kallamadi
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయడం అక్కర్లేదు. అంతలా తమ నటనతో వీరు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక మరో విషయం ఏంటంటే మహేశ్ బాబుకు విజయ్ పెద్ద ఫ్యాన్ అని. అలా విజయ్ దేవరకొండ ఏకంగా తన అభిమాన నటుడి సినిమాకు గెస్ట్ గా వెళ్లేంత రేంజ్ కి వెళ్లిపోయాడు. అలా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం మరో విషయంలో కూడా తన అభిమాన నటుడి సరసన నిలిచి ... ఔరా అనిపించాడు. ఇంతకీ విషయమేంటంటే... హలో... మ్యాగజైన్ మహేశ్ బాబు, విజయ్ దేవరకొండల ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది.




ఫొటో రావడంలో గొప్పేముంది అని అందరికీ అనిపించొచ్చు. కానీ తన ఫొటో వచ్చింది ఏదో మామూలుగా కాదు. ఆహ మ్యాగజైన్ పవర్ లిస్ట్ లో తను స్థానం సంపాదించుకున్నాడు. సదరు మ్యాగజైన్ ఏటా అత్యంత ఎఫెక్ట్ ఉన్న పర్సన్స్ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా పవర్ లిస్ట్ 2021 పేరుతో ఈ ఏడు విడుదలైన జాబితాలో ఈ కుర్ర హీరో చోటు సంపాదించాడు. అది కూడా తన అభిమాన నటుడు మహేశ్ బాబు సరసన. 2021లో డేరింగ్ టాలెంటెడ్ అండ్ పవర్ ఫుల్ న్యూస్ మేకర్స్ జాబితాలో విజయ్ దేవరకొండకు చోటు దక్కడం విశేషం. మొదట సపోర్టింగ్ క్యారెక్టర్లతో తెరకు పరిచయమైన ఈ హీరో అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా తన ఫ్యాన్స్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల్లో ఈ హీరోకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదని పలువురు పేర్కొంటారు. అంతలా తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. అతి త్వరలో టాలీవుడ్ లెక్కలు మాస్టర్ సుకుమార్ తో జత కలుస్తాడని వార్తలు షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: