అందుకే మా ఎన్నికల నుంచి తప్పుకున్న మంచు విష్ణు !
"నేను మా మూవీ ఎన్నికల్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మద్రాసులో, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ నటులకు కలిపి ఒకే అసోసియేషన్ లాంటిది ఉండేది. కానీ మన తెలుగు నటుల కోసం ఒక ప్రత్యేకమైన సంఘం ఉంటే బాగుంటుందని"తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్" ను రూపొందించారు.
అక్కడి కష్ట సుఖాలు తెలుసుకున్న వారే అధ్యక్షునిగా ఎన్నో మంచి పనులు చేశారు. ఇక 1993 లో తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కి తరలిస్తున్న సమయంలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ ల కోసం "అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు మరికొంతమంది సినీ ప్రముఖులు కలిసి"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "ఏర్పాటు చేశారు.
నాన్నగారు మా అధ్యక్ష పదవిలో ఉండకపోయినా సరే సినీ కార్మికులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.1990 లో ప్రభుత్వం సినీ కార్మికుల కోసం ఒక స్థలాన్ని ఇవ్వగా.. దానిని 1997 లో ఒక రాజకీయవేత్త తన ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సాంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే, అప్పుడు నాన్నగారే ఆ విషయాన్ని తెలుసుకొని, గవర్నర్ రంగరాజన్ తో మాట్లాడి ఆ స్థలాన్ని కార్మికులకు చెందే విధంగా చేశాడు.
అంతేకాకుండా దాసరి గారు,మురళి మోహన్ గారు వీరిరువురు కలిసి 2015 లో నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని తెలిపారు.. కానీ నాన్న ఈ విషయంలో జోక్యం చేసుకొని, అప్పుడే వద్దులే గురువుగారు అని సర్దిచెప్పారు.
ఇక ఒక ముఖ్యమైన విషయం నేను మీతో చెప్పాలి మురళీ మోహన్ గారు అధ్యక్ష పదవిలో ఉండి నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో జరిగిన ఒక జనరల్ బాడీ మీటింగ్ హాజరైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ మా అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా కట్టించబోయే ఒక బిల్డింగ్ కి , అయ్యే పూర్తి ఖర్చు లో 25 శాతం నేను, మా కుటుంబం భరిస్తామని కూడా చెప్పాను.
12 సంవత్సరాల నుంచి ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఎవరూ ఆ బిల్డింగ్ ను కట్టించనేలేదు. కానీ ఈసారి ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా నేనే గెలుపొందితే, కచ్చితంగా ఆ బిల్డింగ్ కట్టిస్తాను.
ఇంతకుముందు ఉన్న అసోసియేషన్ వారు అందరూ బాగా హెల్ప్ చేశారని తెలిపారు. మరికొంతమంది సొంత ఖర్చు తో సహాయం చేశారని తెలిపారు.
సినీ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని ఒకరిని ఏకగ్రీవం చేస్తే.. ఆ విషయానికి నేను కట్టుబడి ఉండి పోటీ నుంచి వైదొలుగుతాను. ఏకగ్రీవం కాకపోతే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు."
మా అధ్యక్షుడిగా నన్ను ఆశీర్వదించండి అంటూ ఆయన మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపారు