సీనయ్య సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా..??
వాస్తవంగా గతంలో దర్శకుడు రాజమౌళి సినిమాల కంటే వీవీ వినాయక్ దర్శకత్వంలోకి వచ్చిన సినిమాలకే ప్రజలు, అభిమానులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. రానురానూ వినాయక్‌కు మంచి స్క్రిప్ట్‌లు రాసే రచయితలు దొరకకపోవడం, ట్రెండ్, కల్చర్‌కు తగ్గట్లు ఆయన తీసే సినిమాలు లేకపోవడంతో ఆఫర్లు అలా వెనక్కి వెళ్లిపోయాయి. అయితే అప్పుడే ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వినాయక్ శీనయ్య సినిమా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో వినాయకే హీరో.
శీనయ్య సినిమా కోసం వినాయక్ చాలా బరువు తగ్గారనే వార్తలు వచ్చాయి. శరభ సినిమా దర్శకుడు నరసింహారావు ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట్లో హీరోయిన్ సెట్ కాలేదని, సినిమాకు మరీ ఎక్కువగా బడ్జెట్ అవుతుందనే కారణాలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు వినాయక్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించకపోవడానికి చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ సినిమాపై ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేదన్నారు. కానీ చివరకు నెగిటివ్ రిజల్ట్ వచ్చేదన్నారు. టైం బాలేనప్పుడు ఎవరు చెప్పినా వినాల్సి వస్తుందన్నారు. అలా కాలం గడిపోయిందన్నారు. శీనయ్య సినిమాకు కూడా అలాగే జరిగిందన్నారు. ఇప్పటికే సమయం చాలా వృథా అయిందని, ఇకపై వేగంగా సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నానన్నారు.