లీకైన ఎన్టీఆర్ షో బిగ్ అప్డేట్..!!
అయితే బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ షో త్వరలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో.. ఈసారి జెమినీలో ప్రసారం కానున్న సంగతి అందరికి తెలిసిన విదితమే. ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్ ఈ షో కంటే ముందుగా బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. దీంతో ఈ షో ప్రారంభం కూడా వాయిదా పడింది. అయితే గతంలో ఈ షో ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. దీంతో మళ్లీ త్వరలోనే ఈ షో తెరపైకి రానుందని షో యాజమాన్యం తెలిపింది.
అంతేకాదు.. కొన్ని రోజుల కిందట ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఇదిలా ఉంటే వచ్చేవారం ఈ షో షూటింగ్ కూడా ప్రారభించనున్నట్లు తెలిపారు. అయితే ముందుగా ఎన్టీఆర్ పై కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ వర్క్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇక ఆ తరువాత మళ్ళీ వీటిని ప్రసారం చేసి ఎన్టీఆర్ తో షూటింగ్ చేయిస్తారని టాక్ వినపడుతుంది. అయితే మొత్తానికి ఈ షో ఆగస్టు నుంచి ప్రసారం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.