బన్నీ 'ఐకాన్' కి ఇంకా మూడు నెలలే.. మరీ ఇంత స్పీడా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో స్పీడ్ పెంచేసాడు. ఇటీవల అల వైకుంఠ పురంలో సినిమాతో ఇండ్రస్టీ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హిట్ కొట్టాలని సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు బన్నీ. అయితే అప్పుడెప్పుడో మూడేళ్ళ కింద వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు ఈ హీరో. దిల్ రాజు నిర్మాతగా అఫిషియల్ అనౌన్స్మెంట్ చేసిన ఈ సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు.సంవత్సరాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ గురించి ఎవ్వరూ నోరు విప్పకపోయే సరికి...


 ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సల్ అయ్యిందేమో అనుకున్నారు అభిమానులు.బన్నీ మాత్రం ఐకాన్ ని మర్చిపోయి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.ఇక తాజాగా వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తో పవన్ కి భారీ హిట్ ఇచ్చినా.. మన బన్నీలో ఎలాంటి కదలిక రాలేదు.ఈ నేపథ్యంలో వేణు శ్రీరామ్ ఐకాన్ ని మరో హీరోతో తీయడానికి సిద్ధం అయ్యడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.తాజాగా బన్నీ ఐకాన్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.అంతేకాదు మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తాజా సమాచారం.ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్1 ని పూర్తి చేసే పనిలో పడ్డాడు.


జులై 5 నుండి పుష్ప నయా షెడ్యూల్ మొదలు కాబోతోంది. 20 రోజుల చొప్పున ఒక్కో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తే రెండు షెడ్యూల్స్ 40 రోజుల్లో పూర్తయిపోతాయి.అక్కడితో పుష్ప పార్ట్1 షూటింగ్ ముగుస్తుందని సమాచారం.అయితే ఐకాన్ కోసం సుకుమార్ ని మూడు నెలల సమయం అడిగినట్లు తెలుస్తోంది.అందుకు సుక్కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఈ మూడు నెలలు ఐకాన్ షూటింగ్ లో బన్నీ ఉంటే.. పుష్ప పార్ట్1 ని రిలీజ్ చేసే పనిలో సుకుమార్ ఉంటాడు. ఆ తర్వాత పార్ట్1 విడుదలయ్యాక పార్ట్2 షూటింగ్ ని మొదలుపెట్టే ఆలోచనలో బన్నీ ఉన్నాడట.ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్1 దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: