చారిత్రాత్మక ప్రదేశాల్లో బాలయ్య 'అఖండ'..!!

Anilkumar
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ రోర్ టీజర్ నిరూపించింది.ఇక ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా సినిమా షూటింగ్ లు మొదలవ్వడంతో బాలయ్య కూడా త్వరలోనే 'అఖండ' సెట్ లో అడుగుపెట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో తిరిగి పునప్రారంభం కానుంది.


ఇక కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని చారిత్రాత్మక ప్రదేశాలైన గండి కోట,కడప, చిత్తూరు వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.బాలకృష్ణ తో పాటుగా ఈ షూటింగ్ లో ఇతర ప్రధాన తారాగణం కూడా జాయిన్ కానుంది.ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ లొకేషన్స్ ని పరిశీలిస్తోందట.ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సంధర్భంగా గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు.


అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్టు పాత్ర అని అంటున్నారు. ఇక బాలయ్య సరసన మొదటి సారి యువ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేనితో తన107 వ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: