గోదావరి మధ్యలో జగన్ పుట్టినరోజు ‘పవర్ షో’ – భారీ ఫ్లెక్సీతో వైసీపీ షాక్!
సాధారణంగా రోడ్ల పక్కన, భవనాలపై కనిపించే ఫ్లెక్సీలకు భిన్నంగా… నది మధ్యలో జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోదావరి నది మధ్యలో విస్తరించి ఉన్న భారీ జగన్ ఫ్లెక్సీ… దాని చుట్టూ నిలబడి వైసీపీ నేతలు, కార్యకర్తలు “జై జగన్… జై వైసీపీ” అంటూ నినాదాలు చేయడం చూస్తే మాస్ ఫీలింగ్ వచ్చేస్తోంది. అభిమానులకు ఇది ఒక రకమైన పవర్ షోగా మారింది. జగన్ క్రేజ్ గోదావరి గట్లకే పరిమితం కాదు… నది మధ్యకూ విస్తరించిందన్నట్టుగా ఈ విజువల్స్ చర్చకు దారి తీశాయి. గోదావరి జిల్లాలకే కాదు… రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజును వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు.
పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. రాజకీయంగా వైసీపీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నా… జగన్ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఈ భారీ వేడుకలు మాత్రం పార్టీ శ్రేణుల్లో ఇంకా పవర్ తగ్గలేదన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జగన్‌కు ఉన్న బలమైన ఫ్యాన్‌బేస్‌ను ఈ ఫ్లెక్సీ ఈవెంట్ మరోసారి చూపించింది. మొత్తానికి… గోదావరి మధ్యలో జగన్ ఫ్లెక్సీ అంటే ఇదే మాస్ అనిపించేలా వైసీపీ నేతలు ఈ బర్త్‌డేను హాట్ టాపిక్‌గా మార్చేశారు!