రవితేజ మూవీ @ 8 ఏళ్లు..
మాస్ మహారాజా రవితేజ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈయన సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోగా అనతికాలంలోనే ఎదిగిన వ్యక్తి. ఇక తనదైన నటనతో, కామెడీ పంచ్ లతో అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటారు రవితేజ. ఈయన రీసెంట్ గా క్రాక్ సినిమాతో మంచి హిట్ కొట్టారు. అయితే ఈ రోజు రవితేజ నటించిన బలుపు సినిమా విడుదలై దాదాపు 8 సంవత్సరాలు కావస్తోంది.ఇక ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ శృతి హాసన్,అంజలి కలిసి నటించిన చిత్రం"బలుపు". ఈ సినిమా కంటే ముందు విడుదలైన ఆరు సినిమాలు ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు బలుపు సినిమాతో మళ్లీ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని పాటలకు ఎస్.తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలను పోషించాడు. ఈ సినిమా జూన్ 28-2013 లో విడుదలై ఈ రోజుకి 8 సంవత్సరాలు అవుతుంది.
కామెడీ తో సాగే ఈ సినిమా రవితేజ కెరీర్లో మరో మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.
1). నైజాం-రూ.9.10 కోట్లు
2). ఉత్తరాంధ్ర- రూ.2.55 కోట్లు
3). వెస్ట్- రూ.1.35 కోట్లు
4). సీడెడ్- రూ.4.40 కోట్లు
5). ఈస్ట్- రూ.1.35 కోట్లు
6). కృష్ణ- రూ.1.39 కోట్లు
7). నెల్లూరు- రూ.0.98 కోట్లు
8). గుంటూరు- రూ.1.95 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్+తెలంగాణ మొత్తం కలిపి = రూ.23.45 కోట్లు
ఇండియా కాకుండా మిగతా దేశాలలో కలెక్షన్- రూ.5.30 కోట్లు
మొత్తంమీద టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్= రూ.28.75 కోట్లు
బలుపు సినిమా రూ.14.27 కోట్ల మేరకు థియేటర్ బిజినెస్ జరగగా.. చిత్రం ముగిసేసరికి దాదాపుగా రూ 28.75 కోట్ల మేరకు రాబట్టింది. దీంతో 14.48 కోట్ల లాభం పొందింది.
ఇక రవితేజ ఖిలాడి మూవీ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు రవితేజ.