సినీరంగాన్ని మలుపు తప్పిన ముళ్ళపూడి..!!

N.ANJI
ముళ్లపూడి వెంకటరమణ ఆయన రచనలతో పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన తెలుగు రచయిత తెలుగు నవలలు కథలు సినిమా కథలు హాస్య కథలు వల్లించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హాస్య రచనలకు ఆయన కేరాఫ్ అడ్రెస్. ముళ్లపూడి వెంకటరమణ రచించిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉన్న విషయం అందరికి తెలిసిన విదితమే. ఆయన 1931 జూన్ 28వ తేదిన ధవళేశ్వరంలో జన్మించారు. ముళ్ళపూడి వెంకటరమణ బాపు సహచరుడిగా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగారు. అంతేకాదు.. బాపు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేశారు.
ముళ్లపూడి వెంకటరమణ ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన రచనలను అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు ఎంతో మంది ఆసక్తికరంగా చదివేవారు. అయితే సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని అడిగారంట. అయితే సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ఆయనని అడిగారంట. ముళ్లపూడి వెంకటరమణ రక్త సంబంధం అనే సినిమాకు ,మొదటగా రచన చేశారు. ఆ తరువాత ఎనీఆ్టర్‌ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్‌ మూగమనసులు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది.
అంతేకాదు.. ఆయన సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీసారు. ఇక రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: