ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?
1. విజయ్:
యాక్షన్ డ్రామాగా బి.గోపాల్ డైరెక్షన్ లో విజయశాంతి హీరోయిన్ గా, నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 జనవరి 19వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని వెంకట్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినప్పటికీ, నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
2. విక్కీ దాదా:
క్రైమ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, కామాక్షి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. 1989 మార్చి 9వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా, ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా, అలనాటి అందాల తార రాధ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది.
3. గీతాంజలి:
మొదటిసారి మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1989 మే 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం , అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసి ఏకంగా 7 సెంటర్లలో 100 రోజులు ఆడి విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక క్లాస్ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ,బెస్ట్ డైరెక్టర్ అవార్డు మణిరత్నం అందుకోగా, మరొక ఆరు నంది అవార్డులను కూడా దక్కించుకుంది.
4. శివ:
మరో ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన శివ మూవీ కి కూడా ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. గీతాంజలి సినిమా ద్వారా క్లాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నాగార్జున శివ మూవీ ద్వారా మాస్ ఆడియన్స్ కి కూడా మరింత చేరువయ్యారు. ఇక ఇండస్ట్రీ హిట్ గా మిగిలిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ కు , తనికెళ్ల భరణి కి నంది అవార్డులు కూడా వచ్చాయి.
యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 ఆగస్టు 9వ తేదీన విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, సౌభాగ్యలక్ష్మి ఫిల్మ్స్ బ్యానర్ పై కె.ఎస్. ప్రకాష్ నిర్మించడం జరిగింది. అంతే కాదు ప్రముఖ సీనియర్ నటి రాశి కూడా ఇందులో బాలనటిగా నటించింది. అయితే ఈ సినిమా నిరాశపరిచింది.