రైనా బయోపిక్ కి ఆ స్టారే కరెక్ట్ అంటా..!!

N.ANJI
ప్రస్తుతం సోషల్ మీడియాలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. మహానటి, ఎన్టీఆర్ లపై బయోపిక్ సినిమాలను చిత్రీకరించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎం.ఎస్.ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి వారి సినిమాలను కూడా తెరకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే తరుణంలో క్రికెటర్ సురేష్ రైనా బయోపిక్ గురించి కూడా తాజాగా చర్చ జరుగుతుంది.
ఇక భారత మాజీ క్రికెటర్‌ గా సూరేశ్‌ రైనాకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సూరేశ్‌ రైనాను యాంకర్ తన బయోపిక్‌ సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఇక బయోపిక్ ను సౌత్‌ లో తీస్తే, మీ పాత్రలో ఏ హీరో నటించాలని మీరు భావిస్తున్నారు ? అని యాంకర్‌ ప్రశ్నించారు. అంతేకాక.. ఆ ప్రశ్న పూర్తి కాకముందే వెంటనే రైనా మాట్లాడుతూ.. ‘నా పాత్రలో హీరో సూర్య నటిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి రైనా తన బయోపిక్ కి సూర్య అయితే పాత్రకు తగ్గట్టు మారుతూ తనదైన శైలిలో నటిస్తారన్నారు. అందుకే తన పాత్రకు విలువ పెరుగుతుంది అని రైనా భావించి ఉండొచ్చునని అన్నారు.
అంతేకాదు.. సూర్య నటన గురించి కూడా గొప్పగా కామెంట్స్ చేశారు రైనా. ఇక రైనా సూర్య నటన బాగుంటుందని, ఆయన పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుని తనదైన నటనను కనబరుస్తాడని అందుకే సూర్య అంటే తనకు ఇష్టమని అంటూ మళ్ళీ సూర్య పై తన అభిమానాన్ని చూపించాల్సి వస్తుందని ఆయన అన్నారు..
అయితే క్రికెటర్ల బయోపిక్ విషయానికి ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ యువరాజ్ సింగ్ బయోపిక్ చేయనున్నారు. అంతేకాదు.. యువరాజ్ లైఫ్ లో ఉన్న డ్రామా సినిమాకి మంచి ఫుటేజ్ అవుతుందని అన్నారు. ఇక  అందుకే యువరాజ్ బయోపిక్ ను మేకర్స్ సినిమాగా తీసుకురావాలన్నారు. అంతేకాక నిజమైన హీరో యువరాజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: