వారి కన్ను అక్కడే ఉండేది..దర్శకులపై నటి సంచలన వ్యాఖ్యలు !

Divya

ముఖ్యంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తూనే ఉంది. అంతేకాదు గతంలో కొంతమంది అవకాశాల పేరిట మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన రావడంతో, కొంతమంది నటీమణులు స్వయంగా క్యాస్టింగ్ కౌచ్ ద్వారా తాము ఎదుర్కొన్న సమస్యలను నిరభ్యంతరంగా బయట చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి కొంతమంది నటీమణులు ధైర్యంగా సోషల్ మీడియాకు తెలియ చేయడం విశేషం. అయితే ఎవరెవరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కంగనా రనౌత్:
2020 వ సంవత్సరంలో కంగనారనౌత్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంపై మాట్లాడుతూ.. ఒక దిగ్గజ వార్త వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిపింది. ఆదిత్య పంచోలి తనను బలవంతంగా, శారీరకంగా లొంగ తీసుకున్నారని కంగనా రనౌత్ నిరభ్యంతరంగా బయటకు వెలిబుచ్చారు.

2. రాధిక ఆప్టే:
బాలీవుడ్ లో  తెరవెనుక జరుగుతున్న చీకటి రహస్యాల గురించి రాధిక ఆప్టే, 2016 లో ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. ఆమె ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు,  సౌత్లో ఒక నటుడు తనను రూమ్ కి రమ్మని పిలిచి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, తనను లొంగదీసుకోవాలని చూశాడని చివరికి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చానని ఆమె తెలిపింది. అయితే అతను ఎవరు అన్న విషయం మాత్రం చెప్పలేదు.
3. చిత్రంగడ సింగ్ :
బాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని అంగీకరించి, తను మోడలింగ్ చేసే రోజుల నుంచి ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగే సమయం వరకూ ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల అధినేతలు కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆమె చెప్పుకొచ్చింది.
4. టిస్కా చోప్రా:
2016లో బాలీవుడ్ లో ఎక్కువగా బయటపడిన పదం కాస్టింగ్ కౌచ్. దీని బారినపడిన వారిలో చోప్రా కూడా ఒకరు.సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఒక నిర్మాత ఈమెకు సినిమా అవకాశాలు అందించారు. అయితే అతను తనను లొంగదీసుకోవాలని చూశాడని, తనను  ఒకసారి సినిమా గురించి మాట్లాడాలని రూముకు పిలిచారని, అక్కడ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని ఆమె తెలిపారు.
5. సర్వీన్ చావ్లా:
2019లో సర్వీన్ చావ్లా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మూడుసార్లు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను. ఒక సినిమా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఆ దర్శకుడు నాతో.. నీ శరీరంలోని ప్రతి అణువు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను.. అని నాతో అన్నారు. ఇక అప్పటినుండి నేను అతని కాల్ రిసీవ్ చేయడం కూడా మానేశాను .ఆ తర్వాత తనకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదని నాకు సినిమా అవకాశాలు కూడా రాకుండా చేశారు. ఇక అతను నాతో మాట్లాడిన వాక్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. అంటూ ఆమె బాధపడుతూ తను క్యాస్టింగ్ కౌచ్ బారినపడిన  విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఇక అంతే కాదు హిందీ సినీ పరిశ్రమలో ఎంతో మంది అమ్మాయిలు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ.. మర్మాంగాలను చూడాలని కొంతమంది ఆశిస్తే, అణువణువు అనుభవించాలని మరికొంతమంది ఆశిస్తున్నట్లు అసభ్యకరంగా ప్రవర్తించారని ఎంతో మంది హీరోయిన్లు ధైర్యంగా బయటకి వెళ్లబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: