చెల్లి కోరికను కాజల్ తీరుస్తుందా..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కరోనా క్లిష్ట సమయంలోనే కాజల్ ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే కాజల్ పుట్టిన రోజు సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక తాజాగా కాజల్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కాజల్ పుట్టినరోజు కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ అక్కను ఒక కోరికని కోరారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే.. ఇంతకీ నిషా అగర్వాల్ ఏం కోరిక అడిగారో చూద్దామా. ఇక తన కొడుకు పెద్దవాడు అవుతున్నాడని అందువల్ల తన సోదరి కాజల్ కు కూడా పిల్లలు కావాలని కోరుకుంటున్నానని ఆమె తెలియజేశారు. అయితే తన కొడుకుకు మూడు సంవత్సరాల వయస్సు వచ్చిందని తన సోదరి ఒక బేబీని ఇస్తే బాగుంటుందని ఇది స్వార్థమే అనిపించినా నాకోసం నేను కోరుకుంటున్నానని నిషా అగర్వాల్ తెలిపారు. ఇక కాజల్ చెల్లి కోరిక విషయంలో అక్క ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే  కాజల్ ప్రస్తుతం సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ఇక పెళ్లైనా అన్ని రకాల పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతుండటంతో పాటు బోల్డ్ రోల్స్ లో నటించడానికి కూడా కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కాజల్ నటిస్తుండటం గమనార్హం అనే చెప్పాలి. అయితే కాజల్ దంపతులు పిల్లల విషయాన్ని ఇప్పట్లో పట్టించుకునే అవకాశం అయితే లేదని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే కాజల్ నటించిన ఆచార్య సినిమా దసరాకు విడుదల కానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: