14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ శివాజీ..
ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తమిళంలో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఆల్ టైం ఇండియా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇక 'శివాజి' తెలుగులో ఈ సినిమాకి రూ 15.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ డబ్బింగ్ సినిమాకి ఇంత ఎక్కువ బిజినెస్ జరగడం అదే మొదటి సారి. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగులో టోటల్ గా రూ.17.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది కూడా ఓ ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో బయ్యర్లకు రూ.2.41 కోట్ల లాభాలు అందించింది.
ఇక టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక 2007వ సంవత్సరం నాటికి, "శివాజీ" అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇది మూడు వారాల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఇక 100 కోట్లు వసూలు చేసిన మొదటి తమిళ సినిమాగా శివాజీ నిలిచింది. ఇక అంతేగాక అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.ఇక ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోతుంది.