పుష్ప కోసం రష్మిక అంత రిస్క్ చేసిందా...?

Shanmukha
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌లలో ఒకరు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్‌లో మరో సినిమాను కూడా ఓకే చేసిందట. వాటితో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తోంది. వాటిలో బన్నీ, సుకుమార్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ ఒకటి. పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన ఓ తండా యువతి పాత్రలో రష్మిక కనిపించనుంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం అమ్మడు భారీ రిస్క్ చేసిందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ కరోనా సమయంలో బయటకు రావాలంటేనే భయంగా ఉంటుంది. అందుకనే పుష్ప సినిమా కోసం రష్మిక అంతటి రిస్క్ చేసిందట. ఏంటంటే కరోనా టైంలో బయటకి రాలేమని, సినిమా కోసం మూవీ యూనిట్‌తో పాటు అడవిలోనే ఉండిపోయిందట. ఈ క్రమంలో అనుకోకుండా ఓ సీన్ ప్లాన్ చేశారట. ఆ సీన్‌లో రష్మిక డూప్ లేకుండా చేసిందట. అది ఓ ఫైట్ సీన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మేర వార్తలు సినీ వర్గాల్లోనూ మంచి జోరుమీద సాగుతున్నాయి. అంతేకాకుండా  ఈసినిమాలో కొన్ని సీన్స్‌ కోసం రష్మక ఓ రేంజ్ కసరత్తులు కూడా చేస్తుందట.


ఇదిలా ఉంటే రష్మిక తన తదుపరి సినిమాల కోసం తెగ కష్టపడుతోంది. లక్కీ బ్యూటీ హిందీలో చేస్తున్న ‘మిషన్ మజ్ను’సినిమా కోసం హిందీ నేర్చుకుంటుందట. దాంతో హిందీ భాషతో కూడా తెగ కుస్తీ పడుతుందని ఇప్పటికే వార్తలు తెగ వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని క్లిష్టమైన డైలాగులను సైతం సాధారణంగా చెప్పాలనే రష్మిక తాపత్రయ పడుతుందట. మరి ఈ అమ్మడు తన లక్‌తో తన హిట్‌ల పరంపర కొనసాగిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: