ఫ్యాక్షన్ ప్రేమ కథలకి శ్రీకారం చుట్టిన ప్రేమించుకుందాం రా..

NIKHIL VINAY
ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ ప్రతి సినిమాలో రా అని ఉంటే సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయేవారు.అలా పెరు రావడానికి మొదటిగా బీజం వేసిన సినిమా  ప్రేమించుకుందాం.. రా. ఈ సినిమాకి ఆయన కెరీర్ లోనే కాదు తెలుగు ఇండస్ట్రీలోనూ ప్రత్యేక స్థానం ఉంది.అది ఎలా అంటే ఈ సినిమా తెలుగులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన మొదటి సినిమా.ఈ సినిమాకి ముందు కూడా ఆ బ్యాక్ డ్రాప్ లో కథలు వచ్చాయి కానీ ఇలా పూర్తిగా దానిమిదనే కథని బేస్ చేసుకొని అప్పటిదకా రాలేదు. ఆ విధంగా ప్రేమించుకుందాం రా సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. 

ఇక ఈ సినిమాతో  టాలీవుడ్‌కు దర్శకుడిగా జయంత్. సి.పరంజి హీరోయిన్ అంజలా ఝవేరి పరిచయం అయ్యారు.   అసలు  ప్రేమించుకుందాం..రా అనే ఒక మాములు ప్రేమకథకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌ ని కలిపి ఈ సినిమాని సూపర్ హిట్‌ చేసాడు డైరెక్టర్ జయంత్. అంతేకాదు మాములు మధ్యతరగతి కుర్రాడు రాయలసీమలోని ఓ ఫ్యాక్షన్ కూతురిని ప్రేమిస్తాడు. చివరకు హీరో తన ప్రేమను ఎలా గెలిచాడు అనేది మిగతా కథ .ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటన అలాగే పాటలు చాలా బాగుంటాయి.ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్ చేసింది అనే  చెప్పాలి.

ఈ సినిమాలో   వెంకటేష్, అంజలా ఝవేరి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్నిసార్లు నవ్విస్తాయి అలాగే కొన్ని సార్లు ఏడిపిస్తాయి కూడా. ఇక ఈ సినిమాకి మహేష్ అందించిన సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని బాగా కుదిరాయి. వెంకటేష్  చిన్న పిల్లలతో చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్.ఇక ఈ సినిమా తర్వాత మోహన్ బాబు శ్రీరాములయ్య’ సినిమా , బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సమర సింహారెడ్డి’లాంటి భారీ ఫ్యాక్షన్  సినిమాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: