మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా .... ??
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ సహా మరికొందరు హాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండడంతో తమ సినిమా షూట్ ని నిలుపుదల చేసింది యూనిట్. అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ యొక్క షూటింగ్ పార్ట్ చాలా తక్కువే బ్యాలన్స్ ఉన్నప్పటికీ గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మాత్రం చాలా వరకు పెండింగ్ ఉందని అంటున్నారు.
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అది నిజమే అంటున్నాయట రాజమౌళి సన్నిహిత వర్గాలు. వాస్తవానికి మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దాం అని భావించినప్పటికీ, ఆ సమయంలో విడుదల ప్లాన్ చేసుకున్న సినిమాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, అదీకాక సమ్మర్ అయితే పక్కాగా సినిమాని పలుమార్లు చెక్ చేసుకుని ఎటువంటి లోపాలు లేకుండా విడుదల చేయవచ్చనేది ఆర్ఆర్ఆర్ టీమ్ ఆలోచనట. మరి అందరూ అనుకుంటున్నట్లుగా నిజంగానే ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కె వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే దీనిపై అధికారిక సమాచారం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ..... !!