వామ్మో ఏంటిది..? ఆశ్చర్యపోయిన సమంత!

Suma Kallamadi
సమంత అక్కినేని మొదటిసారిగా చారిత్రక డ్రామా అయిన "శాకుంతలం" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తరచూ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి ఈ కరోనా సమయంలో కూడా ఆయన 50% సినిమా షూటింగ్ పూర్తిచేసి చిత్ర పరిశ్రమకి ఝలక్ ఇచ్చారు. 3 నెలల సమయం లోనే సినిమాకు సంబంధించిన 50 శాతం షూటింగ్ ఎలా పూర్తి చేశారు? అని చాలామంది ఆశ్చర్యపోతూ అడిగినట్లు గుణశేఖర్ ఇటీవల చెప్పుకొచ్చారు.
అయితే కరోనా సమయంలోనూ శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి ఒకటే ఒక కారణమని ఆయన అన్నారు. అదేంటంటే రుద్రమదేవి సినిమా పూర్తి కాగానే శాకుంతలం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై ఏడాది కాలం పాటు గుణశేఖర్ పనిచేశారట. స్క్రిప్ట్ పై కూడా ఆయన చాలాకాలం పాటు పనిచేశారు. అలాగే సినిమా ఎలా రూపొందించాలనే విషయంపై కూడా ఒక పక్కా ప్రణాళిక రూపొందించారు. ముందస్తుగానే ప్లాన్ రూపొందించడం వల్ల శాకుంతలం సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. షూటింగ్ త్వరగా పూర్తి కావడానికి ఇంకొక కారణం ఏమిటంటే.. గుణశేఖర్ కూతురు నీలిమ. ఆమె కూడా శాకుంతలం సినిమా షూటింగ్ లో తన వంతు సహాయం చేశారు. ఆమె షూటింగ్ సెట్స్ లో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి రాపిడ్ టెస్టులు, ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్ నిర్వహిస్తూ అందరి బాగోగులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
ఆమె శరవేగంగా తీసుకుంటున్న జాగ్రత్తలను చూసి సమంత కూడా ఆశ్చర్యపోయారట. వామ్మో, ఏంటిది.. ఇంత ఫాస్ట్ గా పనులు చేస్తున్నారు అని ఆమె అవాక్కయ్యారట. ఈ సినిమా కోసం తాను, తన కూతురు ఎంత కష్టపడుతున్నామో సమంత కూడా బాగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తమ కష్టం చూసిన తర్వాత సమంత కూడా చాలా కష్టపడి.. చిత్రీకరణ త్వరగా పూర్తి కావడానికి తన వంతు కృషి చేశారని ఆయన అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్స్ కూడా నిరుపయోగంగా మారతాయని ఆమె అర్థం చేసుకున్నారని.. తన కూతురు నీలిమపై పూర్తి నమ్మకంతో ఆమె ధైర్యంగా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారని ఆయన అన్నారు. 3 నెలలు సమయంలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి 10 నెలల లోపు ప్రొడక్షన్స్ పనులు కూడా పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
ఇకపోతే ఈ సినిమా మహాభారతంలోని ఆదిపర్వంలోని దుష్యంతుడు - శాకుంతల దేవి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కనున్నది. అయితే ప్రభుత్వం మధ్యాహ్నం 1:00 వరకు సడలింపులు ప్రకటించడంతో.. ఆయన రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అయిపోయారు. ఈ చిత్రం కోసం భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తున్నారు. శకుంతలా దేవి గా సమంత ప్రేక్షకులను ఏ స్థాయిలో అల్లరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: