హైదరాబాద్ : ఓటు వేయడానికి వచ్చి.. వేయకుండానే వెళ్ళిపోతున్నారు?

praveen
17 పార్లమెంటు స్థానాలకు గాను నేడు తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. పటిష్ట బందోబస్తు మధ్య ఈ పోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ప్రచారంతో తమ గల్లీలో తిరిగి హామీల వర్షం కురిపించిన ఆయా పార్టీ అభ్యర్థుల భవితవ్యం ఏంటి అని తేల్చేందుకు అటు ఓటర్లు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతూ ఉన్నారు.

 అయితే కొంతమంది ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలవడం ఇష్టం లేక ఇక నిర్లక్ష్యంగా ఓటు వేయడానికే రాని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఏకంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన జనాలు.. చివరికి ఓటు వేయకుండానే ఇంటికి తిరిగి వెళుతున్న పరిస్థితి వచ్చింది. అదేంటి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు వేయకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్తారు అనుకుంటున్నారు కదా.. దీనికి కారణం ఈవీఎంలు మొరాయిస్తూ ఉండడమే అని చెప్పాలి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఈవీఎంలు సరిగా పనిచేయకుండా.. మొరాయిస్తూ ఉండడంతో చివరికి  ఓటర్లు అసహనానికి గురవుతున్నారు.

 హైదరాబాద్ లోని పలు పోలింగ్ కేంద్రాల తో పాటు ఉమ్మడి ఆర్ఆర్ జిల్లాల పరిధిలో కూడా ఇలా ఈవీఎంలు  మోరాయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్ నగర్, షాద్నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో  ఓటు వేయడానికి వచ్చిన జనాలు గంటల తరబడి ఇక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో గంటల తరబడి క్యూలో  నిలబడలేక ఓటు వేయడానికి వచ్చిన వారు చివరికి వేయకుండానే ఇంటి బాట పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: