ఓవైసీపై అనుమానం.. ముస్లింల ఆధార్ కార్డు చెక్ చేస్తున్న మాధవిలత?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కూడా ఒక పార్లమెంట్ స్థానం గురించే అంతరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అదే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం గురించి. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం గురించి అన్ని పార్టీలు లైట్ తీసుకునేవి. ఒకవేళ అభ్యర్థులను నిలబెట్టిన గెలుస్తారు అనే నమ్మకం కూడా పెట్టుకునేది కాదు. కానీ ఈసారి ఏకంగా ఎంఐఎం కంచుకోటని బద్దలు కొట్టేందుకు హైదరాబాదులో బిజెపి తరఫున మాధవి లత బరిలోకి దిగారు.

 ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే బిజెపి పార్టీ నుంచి ఆమెకు పూర్తిస్థాయి మద్దతు కూడా లభించింది అన్న విషయం తెలిసిందే. అయితే బిజెపి అభ్యర్థి మాధవి లత గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎన్నో సర్వే రిపోర్టులు కూడా తెలిపాయి. ఈ క్రమంలోనే తన గెలుపు విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు.. మాధవి లత ఎప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో దొంగ ఓట్లు పోలవ్వకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గవర్నమెంట్ అధికారులు చేయాల్సిన పనులను కూడా అటు మాధవి లత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఓవైసీ అనుకూల వర్గం దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని అనుమానించిన మాధవి లత ఇలా చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక పోలింగ్ బూత్ కు వెళ్ళిన మాధవి లత ఏకంగా అక్కడ ముస్లిం ఓటర్ల ఆధార్ కార్డులు చెక్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆధార్ కార్డులలో ఉన్న డీటెయిల్స్ అక్కడ ఓటు వేయడానికి వచ్చిన మహిళల డీటెయిల్స్ ఒకటేనా కాదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మాధవి లత. అంతే కాదు కొంతమంది ఓటర్ల పై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ.. వెంటనే వారి ఆధారాలను సేకరించి ఒకసారి చెక్ చేయాలి అంటూ అధికారులకు సూచనలు కూడా ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: