ఒకప్పుడు తెలుగు కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుని అందరి మనసుల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో అప్పట్లో సినీ పరిశ్రమను షేక్ చేశారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా రంభ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. రంభది విజయవాడ. ఈ హీరోయిన్ అసలు పేరు విజయలక్ష్మి. నేడు ఆమె జన్మదినం జరుపుకుంటున్నారు.
సినిమాల్లోకి వచ్చాక రంభగా తన పేరును మార్చుకుని తెలుగు చలన చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపింది.టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందరి అగ్ర హీరోల సరసన ఆడి పాడింది. హీరోయిన్ రంభ టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం, భోజ్ పూరి ఇలా పలు భాషల్లో నటించి అందరి అభిమానాన్ని సంపాదించింది. డాన్సుల్లో సైతం రంభకు తిరుగులేదు. జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే అనే పాటలో ఎన్టీఆర్ సరసన డాన్స్ ఇరగదీసింది. అంతేకాకుండా దేశ ముదురు సినిమాలో కూడా అల్లు అర్జున్ సరసన ఆడి పాడింది. 2010 లో ఏప్రిల్ 7వ తేదిన కర్ణాటక రాష్ట్రంలోని తిరుపతి కల్యాణ మండపంలో ఎన్నారై అయిన ఇంద్ర కుమార్ పద్మ నాధన్ అనే వ్యక్తితో రంభకు వివాహం జరిగింది. ఇంద్రకుమార్ పద్మనాధన్ కెనడాలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాకుండా ఇతను మాజిక్ హుడ్స్ అనే కంపెనీకి అధినేత. రంభను కొన్ని సినిమాల్లో చూసి ఇష్టపడటంతో అలా రంభను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత రంభను పెళ్లి చేసుకుని కెనడా తీసుకుని వెళ్ళాడు. అయితే రంభ మాత్రం సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో టచ్ లోనే ఉన్నారు.