సోనూసూద్ ని కలిసేందుకు సాహసం.. ఇంతకీ ఏం చేశాడంటే?
అయితే సోను సూద్ కరోనా కాలంలో అందిస్తున్న సహాయ సహకారాలుకు గాను ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం ఆయన అభిమానులుగా మారిపోయి ఆయన శ్రేయస్సు కోరుకునే వారి గా మారిపోయారు. దీంతో సోనుసూద్ పేరెత్తితే చాలు ప్రజలందరూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఇక ఎంతోమంది సోనూసూద్ ఒక్కసారి కలిస్తే చాలు అంటూ ఆశపడుతున్నారు. ఇక్కడో యువకుడు కూడా ఇలాగే ఆశపడ్డాడు వికారాబాద్కు చెందిన ఓ యువకుడు సోనూ ను దైవంగా భావిం చాడు. తన దేవుడిని నేరుగా కలవాలని ఎవరూ చేయని సాహసం చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల పల్లికి చెందిన వెంకటేశ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇక వైరస్ కారణంగా విద్య సంస్థలు మూత పడటంతో చివరికి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. ఇక లాక్డౌన్ సమయంలోనూ సోనూ చేస్తున్న కార్యక్రమాలు చూసి అభిమానిగా మారిపోయాడు వెంకటేష్ ఇక సోనూసూద్ ని దైవంగా పూజించడం మొదలు పెట్టాడు ఇక ఇటీవలే లాక్డౌన్ ఉన్నప్పటికీ కాలినడకన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి సోనూసూద్ ని కలవాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే వెంకటేష్ పాదయాత్ర గురించి సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న సోనూ అతనికి ఫోన్ చేసి నడుచుకుంటూ ముంబైకి రావద్దని తిరిగి ఇంటికి వెళ్లాలని తాను హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా ఫోన్ చేసి కలుస్తాను అంటూ చెప్పాడు. అయితే స్వయంగా దైవంగా భావించే సోనూసూద్ ఫోన్ చేయడంతో సంతోషాన్ని పట్టలేకపోయిన యువకుడు సోనూ చెప్పినట్లుగా తన పాదయాత్ర మాత్రం ఆపలేదు. 20 రోజుల్లో ముంబైకి చేరుకొని తన దైవాన్ని కలుస్తాను అంటూ చెబుతున్నాడు.