వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ పూజా హెగ్డే. మొదటి సినిమాతోనే పూజా హెగ్డే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆ తరవాత స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా రాధే శ్యామ్ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాతో పూజా క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని రాధే శ్యామ్ మేకర్స్ అంటున్నారు. రాధే శ్యామ్ సినిమాను ప్రభాస్ తో సహా చిత్ర యూనిట్ కలిసి చూసిందట. కాగా సినిమా చూస్తున్నప్పుడు పూజా పర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయ్యారట. అంతే కాకుండా ప్రభాస్ సినిమా చూసినప్పటి నుండి పూజ హెగ్డేను ప్రశంసిస్తూనే ఉంటున్నాడట. సినిమాలో పూజ చేసిన సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తున్నాడట. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు కురిపిస్తున్నాడంటే పూజా కెరీర్ కు డోకా లేదని అర్థమౌతోంది. పూజా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.అయితే సినిమాలో ఓ పాట మాత్రం మిగిలిపోయింది.
ఇటీవల ఆ పాట చిత్రించడగానికి ప్లాన్ చేయగా అంతలోనే లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ కు కాస్తా బ్రేక్ పడిపోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోయే పూజా తాజాగా మరో ఫోటో షూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఇన్స్టా గ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో పూజా హెగ్డే హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. అంతే కాకుండా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో పూజా కనిపిస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే పూజా హెగ్డే ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో వైపు ఆచార్య సినిమాలోనూ పూజా రామ్ చరణ్ కు జోడీగా నటించింది. వీటితో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. మొత్తానికి పూజా కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉంది.