హాట్ లుక్ తో అదరగొడుతున్న ప్రియాంక జవాల్కర్..
ప్రియాంక జవాల్కర్.. ఈమె 1992 నవంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జన్మించింది. వీరిది బాగా చదువుకున్న మరాఠి కుటుంబం. అయితే వీరు వృత్తిరీత్యా అనంతపురం లో సెటిల్ కావాల్సి వచ్చింది. ఇక తన విద్యాభ్యాసాన్ని ఎల్ ఆర్ జీ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ప్రియాంక, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ హైదరాబాద్ లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లమో కంప్లీట్ చేసింది. ఇకఆ తర్వాత బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.
ప్రియాంక స్వతహాగా మోడల్ కావడంతో మొదట 2017 లో" కలవరం ఆయే " సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ చిత్రాన్ని 2017 లో దర్శకుడు సంపత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఈమె నటించిన తీరు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత 2018 "టాక్సీవాలా" సినిమాలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఈ సినిమాకు హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ఎంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్లుగా మంచి గుర్తింపును పొందారు.
ఇక ప్రస్తుతం ప్రియాంక కన్నడ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న ఒక కన్నడ చిత్రంలో ఈమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ వడియార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ శారీ లో నడుముని చూపిస్తూ,ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన కుర్రకారు అందాలను వర్ణించడం కష్టమే అంటూ కవిత్వాలు కూడా మొదలుపెట్టారు. చూపు తిప్పుకోలేని విధంగా ఈ ఫోటోలు ఉండడంతో చాలామంది ఈమెను చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ఇక ఇంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మన తెలుగమ్మాయి, తన ఇన్స్టా ఖాతాలో ఆరు లక్షల మందికి పైగానే ఫాలోవర్స్ సంపాదించుకోవడం మరొక విశేషం. ప్రియాంక ఇలా షేర్ చేసిందో లేదో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా లక్షకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.