బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు వీళ్ళే..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలో బొమ్మరిల్లు ఒక్కటి. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో నిర్మించారు. ఈ మూవీలో సిద్ధార్ధ, జెనీలియా జంటగా నటించారు. ఈ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిద్ధార్థ్ తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో స్టార్ అయిపోయాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2006లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా అవార్డులు పరంగా కూడా సత్తా చూపించింది. ఇలాంటి అద్భుతమైన సినిమాను కొందరు తెలుగు హీరోలు మిస్ చేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ముందుగా సిద్ధార్థ్ హీరో కాదు. ఆయన కంటే ముందు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఈ కథ చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. కానీ ఎందుకో ఈ కథ వాళ్లకు కనెక్ట్ కాలేదు. అల్లు అర్జున్ ఆసక్తి చూపించినా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా బొమ్మరిల్లు అతని చేతి నుంచి జారిపోయింది. కానీ వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ తో పరుగు సినిమా చేశాడు అల్లు అర్జున్. ఇద్దరు హీరోలు కాదన్న తర్వాత సిద్ధార్థ లైన్లోకి వచ్చాడు. ఇక అదే సమయంలో బొమ్మరిల్లు బ్యానర్ స్థాపించి దేవదాసు సినిమా తెరకెక్కించాడు వై.వి.యస్.చౌదరి. దాని ఇన్విటేషన్ దిల్ రాజు ఆఫీసులో కనిపించడంతో అదే టైటిల్ అయింది.
అయితే హీరోయిన్ గా సింధు తులాని పేరు దిల్ రాజు ప్రపోజ్ చేయగా, హ్యాపీ మూవీ సమయంలో చూసిన జెనీలియా కళ్ళు బాగుంటాయని ఆమె తన హీరోయిన్ అని భాస్కర్ చెప్పేసాడు. జయసుధని కూడా ఒప్పించాడు. 120 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్లిన బొమ్మరిల్లు 105 రోజుల్లో పూర్తి అయిపోయింది. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఇక హాసినిగా జెనీలియా చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం. సిద్ధార్థ్ కూడా ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ రెండింతలు పెంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: