విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడా..?
సైరా సినిమాలో ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన విజయ్ సేతుపతి ఆ తరువాత ఉప్పెన సినిమాలో తన విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దీంతో అప్పటికే ఆయనకున్న కొంత మార్కెట్ కాస్తా భారీ మార్కెట్ గా మారిపోయింది తెలుగులో. దీంతో ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయడం ఖాయం అనుకున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారట. ఇప్పటికే ఓ తెలుగు సినిమాని ఒప్పుకున్న విజయ్ సేతుపతి మరికొన్ని సినిమాల్లో ఒప్పుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట.
మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ తెలుగు మూవీ చేసే అవకాశం అందుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట, ఆయనకి కధ నచ్చడంతో మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా కోసం సేతుపతికి పారితోషకం తో పాటుగా సినిమాలో వాటా కూడా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి రెండు వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గా ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది.