కీర్తి సురేష్ పాత్ర పై షాకింగ్ న్యూస్ !
ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడినా ఈ మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో నటిస్తున్న కీర్తి సురేష్ పాత్రకు సంబంధించిన విషయాలు లీక్ అయ్యాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఈ మూవీకి హైలెట్ గా ఉంటుంది అంటున్నారు.
ఈ మూవీలో కీర్తి పాత్ర స్క్రీన్ టైమ్ మహేష్ తో సమానంగా ఉంటుందని తెలుస్తోంది. కీర్తి మహేష్ బాబుకు సబార్డనేట్ గా కనిపిస్తుంది అని లీకులు వస్తున్నాయి. ఈ మూవీ కథ మొత్తం బ్యాంకు స్కామ్ నేపథ్యంలో నడుస్తూ సోషల్ మెసేజ్ తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు.
ఈ మూవీ లో మహేష్ బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తే అదే బ్యాంక్ లో మహేష్ సహ ఉద్యోగిగా కీర్తి సురేష్ నటన హాస్యంతో పాటు చాల గ్లామర్ వలకపోస్తూ ఉంటుంది అని టాక్. ఇప్పటికే ఈమూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని స్థిర నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు వల్ల టాప్ హీరోల సినిమాలు అన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి వైపు చూస్తున్న పరిస్థితులలో ఇంత పోటీ మధ్య మహేష్ నిలబదతాడా లేదా అన్నది ప్రస్తుతానికి సందేహం. ‘గీత గోవిందం’ రాబోతున్న పరుశు రామ్ మూవీ కావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి..