వాళ్లు బ్లాక్ చేశారు.. జీవితం ఇలా అవ్వడానికి మా పేరెంట్సే కారణం.. !

MADDIBOINA AJAY KUMAR
సీనియ‌ర్ న‌టీన‌టులు మంజులా విజ‌య్ కుమార్ ల వార‌సురాలిగా వ‌నిత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేవీ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వ‌నిత మొద‌టి సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర‌వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది. అంతే కాకుండా త‌మిళ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక‌ ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే ఈ న‌టి మూడు పెళ్లిల్లు చేసుకుని విడాకులు తీసుకోవ‌డం మ‌రోఎత్తు. దాంతో కొద్దిరోజులు త‌ర‌చూ వార్తల్లో నిలుస్తూ వివాదాస్ప‌ద న‌టిగా పాపుల‌ర్ అయింది. కాగా తాజాగా ఓ ఇంట‌ర్యూలో వ‌నిత సంచ‌ల‌న విష‌యాలు భ‌య‌ట‌పెట్టింది. త‌న తల్లి దండ్ర‌ల వల్లే త‌న జీవితం ఇలా త‌యారైంద‌ని చెప్పింది. త‌న‌కు 18 ఏళ్ల వ‌య‌సులోనే పెళ్లి చేశారని. మొద‌టి భ‌ర్త త‌ర‌చూ వేధింపులకు గురిచేశేవాడ‌ని తెలిపింది. దాంతో ఎప్పుడూ పుట్టింటికి రావాల్సివ‌చ్చేద‌ని ఇక చివ‌రికి విడాకులు తీసుకున్నామ‌ని తెలిపింది. 
ఆ త‌ర‌వాత రెండో పెళ్లి చేసుకోగా రెండో భ‌ర్త త‌న‌ను భాగా చూసుకునేవాడ‌ని కానీ త‌న తండ్రి పిల్ల‌ల సంర‌క్ష‌ణ విష‌యంలో కేసు పెట్టడం వ‌ల్ల తామిద్ద‌ర విడిపోవాల్సివ‌చ్చింద‌ని తెలిపింది. అప్పటి నుండి త‌న ముగ్గురు బిడ్డ‌ల బాధ్య‌త‌ను తానే చూసుకుంటున్న‌ట్టు పేర్కొంది. ఇక మూడో పెళ్లి గురించి మీకు తెలిసిందే అంటూ స‌మాధానమిచ్చింది. అంతే కాకుండా త‌న చెల్లెల్ల జీవితాల‌ల్లో వెలుగులు నింపింది తానేన‌ని కానీ ఇప్పుడు వాళ్లు కూడా త‌న‌ను పట్టించుకోవ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇద్ద‌రు చెల్లెల్ల‌కు మంచి సంబంధాలు సెట్ చేశాన‌ని ఇప్పుడు వాళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నార‌ని కానీ త‌న‌ను ప‌ట్టించుకోర‌ని చెప్పింది.  వారు సోష‌ల్ మీడియాలో కూడా త‌న‌ను బ్లాక్ చేశార‌ని చెప్పింది. త‌న చెల్లెలి పెళ్లికి కూడా త‌న‌ను ఆహ్వానించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న వ‌ల్ల తల్లిదండ్రులు ప‌రువు పోయిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని కానీ వారివ‌ల్లే త‌న జీవితం ఇలా మారింద‌ని ఎమోష‌న‌ల్ అయింది. నా ఫ్యామిలీ స‌పోర్ట్ నాకు లేదు ఒక‌వేళ వారి స‌పోర్ట్ ఉంటే నా జీవితం మ‌రోలా ఉండేద‌ని వ‌నితా చెప్పుకొచ్చింది. ఏదేమైనా జీవితంలో ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని దేవుడిద‌యతో ఈ స్థాయికి రాగ‌లిగాన‌ని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: