పవన్ చేయలేని పని రేణూ ఇలా చేస్తున్నారు..
ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుతున్నానని, ఎవరైనా ఎలాంటి సాయమైనా తనను కోరొచ్చని, అవసరమైన వారు మాత్రమే సాయాన్ని అడగాలని ఆమె ఓ మెసేజ్ పెట్టారు. కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలంతా సినిమా ప్రమోషన్ ని పక్కనపెట్టి సోషల్ మీడియా వేదికగా కొవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడటం సంతోషంగా ఉందని చెప్పారామె. తాను కూడా వారి బాటలోనే ఇన్ స్టా వేదికగా కొవిడ్ బాధితులకు సహాయం చేస్తానన్నారు.
ఆక్సిజన్ లభ్యత, ఆస్పత్రిలో బెడ్ల కొరత, ఇతర అత్యవసర మందులకోసం ఎవరైనా తనను సంప్రదించొచ్చని చెప్పారు. అయితే తాను మాత్రం ఆర్థిక సాయం చేయలేనని, మాట సాయం లేదా, ఎవరైనా దాతల సాయం అభ్యర్థిస్తానని అన్నారు రేణూ దేశాయ్.
వాస్తవానికి దేశవ్యాప్తంగా కరోనా రోగులకు ఆస్పత్రిలో బెడ్ల కొరత ఉంది. కొన్ని చోట్ల బెడ్ల లభ్యత ఉన్నా కూడా ఆ సమాచారం అవసరమైనవారికి చేరేందుకు ఆలస్యం అవుతోంది. అటు వ్యాక్సినేషన్ ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ ల వల్ల ఎక్కడికక్కడ సొంత ప్రాంతాలకు వెెళ్లేవారు కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. ఉపాధి కోల్పోయినవారు, కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా వచ్చి, మరింతగా ఆర్థికంగా చితికిపోయినవారు కూడా లెక్కకు మిక్కిలి కనపడతారు. వీరందరికీ సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తూ మానవత్వం చూపిస్తున్నారు. వారిలో ఇప్పుడు రేణూదేశాయ్ కూడా చేరారు. పవన్ కల్యాణ్ నేరుగా సాయం చేయలేకపోతున్నా.. ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రం ఇలా అందరికోసం అంటూ ముందుకొచ్చారు.