ఈ యాంకర్స్ ఏ ఊరో తెలుసా..!

N.ANJI
బుల్లితెరపై యాంకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బుల్లితెరపై ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం సీరియల్స్ తో పాటు వివిధ రకాల షోస్, రియాల్టీ షోస్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ కారణంగా యాంకర్స్ కూడా పుట్టుకొచ్చారు. అందులో అగ్రశ్రేణిలో సుమ,ఝాన్సీ, ఉదయబాను, తర్వాత అనసూయ, రష్మీ ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది యాంకర్లు వచ్చి ఎవరి రేంజ్ లో వాళ్ళు గుర్తింపు పొందారు.
హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అయితే ఈ యాంకర్స్ ఎక్కడ  పుట్టారో, వారి వివరాలేమిటో అనే విషయాల్లోకి వెళ్తే, ముందుగా సుమ గురించి ప్రస్తావించాలి. కేరళకు చెందిన ఈమె తెలుగు అబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్ళాడి చాలా కాలం నుండి హైదరాబాద్ లో స్థిరపడింది. యాంకర్ ఉదయభాను తెలంగాణలోని  కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నుండి బుల్లితెరకు పరిచయమైంది. ఇక సీనియర్ యాంకర్ ఝాన్సీ అయితే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది.
బుల్లితెర గ్లామర్ యాంకర్ శ్రీముఖి నిజామాబాద్ కు చెందింది. సీనియర్ యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జన్మించింది. ప్రస్తుతం ఆమె కూడా హైదరాబాద్ లో సెటిలయింది. ప్రస్తుతం బుల్లితెర లో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న వర్షిణి తమిళ నాడుకు చెందినప్పటికీ  తన కుటుంబంతో పాటు హైదరాబాద్ లోనే ఉంటోంది.
ఇక గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియ సొంత ఊరు ప్రకాశం జిల్లా. ఇక వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం చిన్నప్పుడే హైదరాబాద్ కి రావడంతో అక్కడే సెటిల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాంకర్ మంజూష ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటోంది. యాంకర్ అనసూయ  తెలంగాణలోని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం నుంచి వచ్చింది. తండ్రి తెలంగాణా అయినా, తల్లిది కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం. యాంకర్ గా వచ్చి, ప్రస్తుతం అనసూయ హైదరాబాద్ లోనే సెటిలయింది. గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జన్మించింది. అయితే ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్,  తల్లి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: