అవికా ఈసారన్నా ఆవిరవకుండా ?
అయితే ఇప్పుడు మళ్లీ ఫిట్ గా తయారై ఫుల్ స్లిమ్ గా కనిపిస్తూ.. ఆర్ యూ రెడీ అంటోంది అవిక. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ లో ఓ హీరోయిన్ గా నటిస్తోంది. నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్రంలోనూ లీడ్ రోల్ చేస్తోంది అవికా గోర్. ఈ రెండు వర్కింగ్ లో ఉండ గానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అవికా.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో, ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్ పై ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'అమరన్ ' ఇన్ ది సిటీ-చాప్టర్ 1' సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అవికాగోర్.
ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ స్టోరీలైన్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు మేకర్స్. ఆది సాయి కుమార్ చివరగా చేసిన శశి సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేదన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం తనకు విజయాన్ని అందించి తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందని నమ్ముతున్నాడు ఆది. మరి ఇలా సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకొస్తున్న అవికా గోర్ తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుందని అంటున్నారు. అంతా వికా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని సినిమా వర్గాలు జోష్యం చెబుతున్నాయి.