షాకింగ్: ఒకేసారి 12 టీవీ ఛానళ్లు ప్రారంభిస్తున్న రామోజీరావు..!
అలాంటి రామోజీ గ్రూప్ నుంచి ఇవాళ మరో 12 టీవీ ఛానళ్లు రాబోతున్నాయి. రామోజీ గ్రూప్‌లో ఇప్పటికే ఈటీవీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ వంటి ఛానళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈటీవీ భారత్ పేరిట దేశంలోని అన్ని భాషల్లోనూ న్యూస్ పోర్టళ్లు నడుపుతున్నారు. ఇక ఇప్పుడు పిల్లల వినోదం లక్ష్యంగా మరో 12 ఛానళ్లు తీసుకొస్తోంది రామోజీ గ్రూప్.
భాల భారత్ పేరుతో 12 భాషల్లో ఈ ఛానళ్లు రాబోతున్నాయి. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్ని విభిన్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది బాలభారత్.. పాతికేళ్లుగా వినోదరంగంలో తనదైన ముద్ర వేసిన.. ఈటీవీ నెట్ వర్క్.. ఇప్పుడు చిన్నారుల కోసం.. ఈ ఛానళ్లు తీసుకొస్తోంది. ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా.. ఈ 12 ఛానళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు. స్థానిక భాషలో.. గ్లోబల్ కంటెంట్ అందించాలన్న ఆలోచనతో.. ఈటీవీ 11 భారతీయ భాషల్లో ఈ చానళ్లను తీసుకొస్తోంది.
తెలుగుతో పాటు.. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనుసులను గెలుచుకున్న గ్లోబల్ షోలతో పాటు.. దేశీయ వినోదాన్ని బాలభారత్ ఛానళ్లు అందించనున్నాయి. చిన్నారులను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన కంటెంట్ ను స్థానిక భాషలో అందిస్తూ.. పిల్లల టెలివిజన్ ప్రపంచాన్నే సరికొత్తగా మార్చేందుకు బాలభారత్ వస్తోంది.