కుర్ర హీరోలకి అఖండతో చెమటలు పట్టిస్తున్న బాలయ్య...
ఉగాది రోజున ఈ చిత్రం టైటిల్ ను 'అఖండ' గా ప్రకటించి ఆ టీజర్ ను విడుదల చేశారు.అలా విడుదల చేశారో లేదో సోషల్ మీడియాలో సెన్సేషనల్ హిట్ అయ్యి తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ టీజర్లో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…' అంటూ బాలయ్య చెప్పే డైలాగులు కూడా హైలెట్ గా నిలిచాయి. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో 'ద్వారక క్రియేషన్స్' బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక టీజర్ లో బాలయ్య పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ ఏంటో పూర్తిగా అర్ధమైపోతుంది. బాలయ్యని చూసి కుర్ర హీరోలు సైతం తెగ భయపడుతున్నారు. నిజంగా బాలయ్య కుర్ర హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఆదరకొడుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటి వరకూ 'అఖండ' టీజర్ 28 మిలియన్ల వ్యూస్ ను అలాగే 370K లైక్స్ ను సాధించింది.