కల్యాణం చేసుకోబోతున్న యువ హీరో..!

Suma Kallamadi
ఫలక్‌నుమాదాస్‌ సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌ సేన్‌. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో డైలాగ్స్, సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా షురూ అయింది. విద్యాసాగర్‌ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ఇక ముహూర్తపు సన్నివేశానికి విష్వక్‌ సేన్‌ తల్లి దుర్గ క్లాప్‌ కొట్టారు. బాపినీడు.బి, సుధీర్‌ మాట్లాడుతూ –‘‘లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టైటిల్‌ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. వినోదం సహా అన్ని అంశాలున్న ఎంటర్‌టైనర్‌ ఇది. విష్వక్‌ నటించిన, నటిస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా’’ అన్నారు. ప్రేమ, వినోదం అన్నీ ఉన్న సినిమా. టైటిల్‌ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు దర్శక నిర్మాతలు. హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు.
అయితే ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న సినిమా పాగల్ విషయానికి వస్తే.. ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. పాగ‌ల్ సినిమాపై కూడా అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. పాగల్ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. ఇందులో విశ్వక్ సేన్‌ను కొంత మాస్‌తో పాటు మరికొంత రొమాంటిక్‌గా చూపించారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్‌గా సిమ్రాన్ చౌదరి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: