అఖిల్ తొడపై ఎన్టీఆర్ చెయ్యి వేయడం పై ఆర్జీవీ కామెంట్స్..
తాజాగా జూనియర్ ఎన్టీఆర్, అఖిల్‌పై సంచలన ట్వీట్ చేశారు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసిన సందర్భంలో వాళ్లు సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోను షేర్ చేశారు. అంతటి తో ఆగక.. ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టాల్లో పడినట్లే అంటూ సెటైర్ వేశారు.. ఆ వీడియో లో ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడపై గిల్లడం.. చాలా చనువుగా వీళ్లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే.. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా " అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇక అంతకుముందు ట్వీట్‌లో నారా లోకేష్‌పై వర్మ సెటైర్ వేశారు.. అమ్మాలను వదిలేసి.. సెల్ఫీలపై పడిపోయాడని ఎద్దేవా చేశారు. "అక్కడ తారక్, మరియు అఖిల్అక్కినేనిల ప్రేమకథ అలా ఉంటే. ఇక్కడ నారా లోకేష్ అమ్మాయిలను వదిలేసి.. సెల్పీలపై పడిపోయాడు.. ఇది స్త్రీ జాతి ముగింపా అంటూ మరో ట్వీట్ చేశాడు.లోకేశ్ బాబు సెల్ఫీల పై కామెంట్ చేసి తెలుగు దేశం శ్రేణుల, అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు వర్మ.. ఇక ఈ విషయం పై నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపించారు.