100 కోట్ల అన్వేషణలో పవన్ బిజీ !

Seetha Sailaja
‘వకీల్ సాబ్’ విడుదలకు ఇక ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు ఏర్పడిన డిమాండ్ రీత్యా ఎలాంటి కోవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ మూవీ మ్యానియా ఇలా కొనసాగుతూ ఉంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య అధికారికంగా 1.50 లక్షలు స్థాయి దాటిపోయింది.

ఈ విధంగానే పరిస్థితులు కొనసాగితే ఈవారాంతానికి కరోనా కేసుల స్థాయి ఏ స్థాయికి చేరుకుంటాయో ప్రభుత్వాల అంచనాలకు కూడ అందడంలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి 10 రోజుల క్రితం ఎదురై ఉంటే ‘వకీల్ సాబ్’ విడుదలను వాయిదా వేసి ఉండేవారు. ఈ ఆఖరి నిముషంలో ఈమూవీ విడుదల వాయిదా వేయలేని పరిస్థితి.

ఈమూవీ బయ్యర్లు మొదట్లో తాము భారీ మొత్తాలు పెట్టి కొంటున్నప్పుడు ఈ మూవీకి బెనిఫిట్ షోలు ఉంటాయని అదేవిధంగా ఈ వీకెండ్ నుంచి వచ్చే వారం రాబోతున్న ఉగాది పండుగ వరకు ఈమూవీ కలక్షన్స్ కోసం అదనపు షోలు వేసుకోవచ్చని భావించారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ధియేటర్లలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కొనసాగడమే ఒక అదృష్టంగా మారింది.

ఈ ఆక్యుపెన్సీ విషయంలో మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో తెలియని పరిస్థితిగా మారింది. దీనికితోడు ఈవారాంతం వరకు పవన్ అభిమానులతో కళకళలాడిన ‘వకీల్ సాబ్’ ధియేటర్లకు సగటు ప్రేక్షకులు తమ కరోనా భయాలను పక్కకుపెట్టి ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఎంతవరకు వస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ 100 కోట్ల కలక్షన్స్ ఫిగర్ ను దాటడానికి ఎన్నిరోజులు పడుతుంది అన్న చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఓవర్సీస్ లో కూడ పరిస్థితులు ఏమాత్రం బాగుండక పోవడంతో ఈమూవీకి 2 మిలియన్ కలక్షన్స్ రావడం జరిగే పనేనా అంటూ సందేహ పడుతున్నారు. టోటల్ పాజిటివ్ మ్యానియా ఈమూవీకి ఏర్పడినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం సహకరించక పోవడం ఒక విధంగా పవన్ రీ ఎంట్రీ మూవీకి సమస్యగా మారింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: