ఆ సినిమా ప్లాన్ తో లక్షలు కొట్టేశారు...? చివరికి జరిగింది ఇదే...?

VAMSI
సినిమాలను చూడడం ప్రేక్షకులకు చాలా సరదా. మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు కడతారు. కానీ అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు.. వివిధ రకాల కథలతో వినూత్నంగా తెరకెక్కిస్తారు దర్శకులు. ఇలా సినిమాల ప్రభావం ప్రేక్షకులపై చాలానే ఉంటుంది. యూత్ అయితే హీరో హీరోయిన్లను తెగ ఫాలో అవుతూ వాళ్లనే అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో గజ దొంగల కూడా సినిమాలు బాగా చూస్తున్నారు. చూడడం కాదు సినిమాలలో వాళ్లకు పనికొచ్చే అంశాలను పసిగట్టి మరి బడా ప్లానింగ్ లు చేస్తున్నారు.

అవును ఇది నిజమే... సినిమా కథ లలో వారికి ప్రజలను దోచుకునేందుకు ఉపయోగపడే విషయాలను చూసి సేమ్ అలాగే ప్లాన్ చేయడం, ప్రజల దగ్గర నుండి  డబ్బులు లేదా విలువైన ఆభరణాలు, వస్తువులు తీసుకుని అక్కడి నుండి పారిపోవడం సదా మామూలై పోయింది.  తెలంగాణలో ‘భద్రమ్’ సినిమా చూసి మనుషుల ప్రాణాలను తీసి వారి ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహ చేస్తే..నిన్న ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలోని రైస్ పుల్లింగ్ పాయింట్ తో తమిళనాట రూ.26 కోట్లు అమాంతం నొక్కేశారు. అయితే అదలా ఉండగా .. రెండు రోజుల క్రితం తెలంగాణలో ‘జులాయి’ సినిమాలోని ప్లాన్ అప్లై చేసి బ్యాంకు కొల్లగొడితే.. తాజాగా.. ‘గ్యాంగ్’ సినిమా కాన్సెప్ట్ తో నగదు మరియు ఆభరణాలు స్వాహా చేసే ప్లాన్ వేశారు.

ఈ లేటెస్ట్ ఘటన ఢిల్లీలోని పితాంపుర ప్రాంతంలో చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే..పితాంపుర ప్రాంతానికి చెందిన ఓ డాక్టరును సెలెక్ట్ చేసుకున్న దుండగులు డాక్టర్ ఇంటి దగ్గర కాపు వేసి ఆయన్ని ఎత్తుకెళ్లారు. సీబీఐ అధికారులమంటూ ఇంటి లోపలికి ప్రవేశించి నానా హంగామా చేశారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారి  ఫోన్లు లాగేసి బ్లాక్ మనీ ఎక్కడ దాచి పెట్టారంటూ యాక్టింగ్ చేశారు. సోదాల పేరుతో ఇల్లు మొత్తం గాలించి మొత్తం రూ.36 లక్షల డబ్బు బయటకు తీశారు. అంతటితో ఆగకుండా,  వారి హాస్పిటల్ లో కూడా రైడ్ చేయాలి అంటూ..., వారితో పాటు కారులో బయలుదేరారు. అయితే... ఈ వ్యవహారంపై మొదట్లోనే అనుమానం వచ్చిన ఆ డాక్టర్ కారు మౌర్య ఎన్ క్లేవ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. బ్రేక్ వేసి పోలీస్.. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసాడు.

దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ ముగ్గురు దుండగులను  పట్టుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే... పోలీసులు కొన్ని ఆసక్తికర అలాగే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ సినిమా ఒరిజనల్ వర్షన్ అయిన.. అక్షయ్ కుమార్ ‘స్పెషల్26’ చూసి ఈ స్కెచ్ గీసినట్టు చెప్పారట. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు.కేసు నమోదు చేశారు పోలీసులు. కాబట్టి సినిమాలో కేవలం ఆహ్లాదం కోసం మాత్రమే చూడకుండా.. ఆ సినిమాలోని మెసేజ్ మన బాధ్యత. అప్పుడే మన జీవితం తో పాటు మన తోటి వారి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: